లోన్ కావాలంటే కోరిక తీర్చాల్సిందే... 200 మంది మహిళలతో బ్యాంక్ ఉద్యోగి రాసలీలలు

లోన్ల కోసం బ్యాంక్‌కి వచ్చే మహిళలను లోబరుచుకుని వారితో రాసలీలలు సాగిస్తున్న ఉద్యోగి బండారాన్ని అతడి భార్యే బట్టబయలు చేసింది. అతడి సెల్‌ఫోన్లో సుమారు 200 సెక్స్ వీడియోలు, న్యూడ్ ఫోటోలు చూసి షాకైన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. Also Read: తమిళనాడులోని తిరుచ్చి జిల్లాకు చెందిన ఎడ్విన్‌ జయకుమార్‌ (36) పుదుకోట్టై జిల్లాలోని ఓ బ్యాంకులో క్యాషియర్‌‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం అతడికి తంజావూరుకు చెందిన మహిళ(32)తో వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి జయకుమార్‌ తనతో సన్నిహితంగా ఉండకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. రాత్రిళ్లు తనను పట్టించుకోకుండా సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేయడాన్ని సహించలేకపోయింది. దీనికి తోడు పుట్టింటి నుంచి 50 సవర్ల బంగారా తీసుకురావాలని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. Also Read: భర్త ఇలా ఉండటానికి కారణమేమితో తెలుసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. అతడికి తెలియకుండా రెండు సెల్‌ఫోన్లను ఓపెన్ చేసి చూసింది. ఫోన్లలో 200 మందికి పైగా మహిళలతో తన భర్త సాగిస్తున్న రాసలీలలు, వారితో కలిసి తీసుకున్న న్యూడ్ ఫోటోలు కనిపించడంతో షాకైంది. వాటిలో అనేక మంది మహిళలకు చెందిన బ్యాంక్ వివరాలు, సెల్‌ఫోన్ నంబర్ల కనిపించాయి. బ్యాంకుకు లోన్ల కోసం వచ్చే మహిళలను తన భర్త లొంగదీసుకుంటున్నట్లు నిర్ధారించుకుంది. చుట్టుపక్కల ఉండే కొందరు మహిళలతోనే అతడు కామకలాపాలు సాగించినట్లు తెలుసుకుంది. Also Read: జయకుమార్‌కు బ్యాంకులో పనిచేస్తున్న ఓ మహిళ సహకరిస్తున్నట్లు అతడి భార్య తెలుసుకుని నిలదీసింది. తన బండారాన్ని బయటపెట్టిన భార్యను చంపేందుకు జయకుమార్ ఆమెపై హత్యాయత్నం చేశాడు. ఆమె చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించి ఆ కీచక భర్త గురించి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జయకుమార్ తన 13 సెల్‌ఫోన్లలోని డేటాను మొత్తం డిలీట్ చేసేశాడు. పోలీసులకు దొరికిపోతానన్న భయంతో ఎడ్విన్ జయకుమార్ తల్లి, సోదరి, బ్యాంకులో తనకు సహకరించిన మహిళతో కలిసి పరారయ్యాడు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2SXwSed

Post a Comment

0 Comments