ఫ్యామిలీ అపార్ట్‌మెంట్ల మధ్య బంగ్లా యువతులతో సెక్స్ దందా.. 8 మందికి విముక్తి

నగరంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఫ్యామిలీస్ ఉండే కాలనీలో నిర్వహిస్తున్న సెక్స్‌రాకెట్‌ను చేధించిన పోలీసులు 8 మంది యువతులను పోలీసులు రక్షించి.. నలుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. సెక్స్‌వర్కర్లలో ఏడుగురు బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారిని అక్రమ మార్గాల్లో ఒడిశాకు తీసుకొచ్చి వ్యభిచార చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. Also Read: బంగ్లాదేశ్ యువతులను వారి స్వదేశానికి తిరిగి పంపించేందుకు భువనేశ్వర్ పోలీసులు ఢిల్లీలోని విదేశాంగ శాఖను సంప్రదించారు. వారికి సంబంధించిన అన్ని వివరాలను సేకరించిన పోలీసులు బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు సమాచారమిచ్చారు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత వారిని స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అన్ని లాంఛనాలు పూర్తయ్యాక వారిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారులు.. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్(బీజీబీ)కి అప్పగిస్తుందని వెల్లడించారు. Also Read: రైడింగ్‌లో పట్టుబడిన మరో యువతిని కోల్‌కతా నివాసిగా గుర్తించి ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. వీరందరినీ సెక్స్ మాఫియా కిడ్నాప్ చేసి అక్రమంగా వ్యభిచార కూపంలోకి దించిందని పోలీసులు చెబుతున్నారు. వీరిలాగే కనిపించకుండా పోయిన ఎంతో మంది మహిళలు వ్యభిచార కేంద్రాల్లో బతుకీడుస్తున్నట్లు తెలుస్తోందని, అలాంటి వారిని రక్షించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3bUV8WY

Post a Comment

0 Comments