కాకినాడలో కిరాతకం... భార్య ఎదుటే లారీడ్రైవర్ దారుణహత్య

జిల్లా కేంద్రం కాకినాడలో బుధవారం అర్ధరాత్రి కలకలం రేగింది. గుడారిగుంటలో నక్కా బ్రహ్మానందం అనే లారీ డ్రైవర్‌ని గుర్తుతెలియని అత్యంత కిరాతకంగా చంపేశాడు. ముఖానికి ముసుగు ధరించి వచ్చిన దుండగులు అతడికి విచక్షణా రహితంగా నరికి చంపేసి పరారయ్యాడు. Also Read: ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరగడంతో స్థానికులెవరూ గమనించలేకపోయారు. దుండగుడిని అడ్డుకునేందుకు బ్రహ్మానందం భార్య ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆమెచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2V50GIv

Post a Comment

0 Comments