కులాంతర వివాహానికి నో చెప్పిన పెద్దలు... యువతి ఆత్మహత్య

కులాంతర వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ నగరంలో బుధవారం జరిగింది. పెదవాల్తేరు పోలమాంబ దేవాలయం సమీపంలో నివాసముంటున్న యువతి (20), డాబాగార్డెన్స్‌కు చెందిన ఓ యువకుడు కొన్నా్ళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి సామాజిక వర్గాలు వేరుకావడంతో ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. Also Read: నాలుగు రోజుల క్రితం ఆ యువకుడు ప్రియురాలి నివాసానికి వెళ్లి తమ ప్రేమ వ్యవహారం గురించి చెప్పి పెళ్లి చేయాలని కోరాడు. దీనికి అంగీకరించని యువతి తల్లిదండ్రులు అతడిని మందలించి పంపేశారు. ఆ తర్వాత వారి ఇంట్లో గొడవలు కావడంతో యువతి మనస్తాపానికి గురైంది. బుధవారం మద్దిలపాలెంలోని సొంతింటికి వచ్చిన ఆమె మేడపై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎంవీపీ కాలనీ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2vRMKHa

Post a Comment

0 Comments