భువనగిరిలో విషాదం.. హోటల్‌లో విషం తాగిన యువజంట, భర్త మృతి

జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకున్న జంట రోజు తిరగకముందే ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో భర్త ప్రాణాలు కోల్పోగా.. భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. Also Read: జిల్లాలోని జంగారెడ్డిపల్లికి చెందిన స్వామి, ఉమ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లి చేసేందుకు రెండు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో ప్రేమజంట ఇంటి నుంచి పారిపోయి ఈ నెల 16న వివాహం చేసుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీసులను ఆశ్రయించారు. Also Read: ఈ క్రమంలోనే సోమవారం వారిద్దరూ కలిసి భువనగిరి శివారులోని డాల్ఫిన్ హోటల్‌లో రూమ్ అద్దెకు తీసుకున్నారు. మంగళవారం ఉదయం వారు గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్‌ సిబ్బంది తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లగా ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో వారు భువనగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిద్దరిని హాస్పిటల్‌కు తరలించేలోగానే స్వామి ప్రాణాలు కోల్పోయాడు. ఉమ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/39JW5Qk

Post a Comment

0 Comments