హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ ప్రాంతంలో దారుణం జరిగింది. కామాంతో కళ్లు మూసుకుపోయిన ఫోటోగ్రాఫర్ తన స్టుడియోకి వచ్చిన మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు చాకచక్యంగా తప్పించుకుని స్థానికులకు విషయం చెప్పడంతో ఆ కామాంధుడికి దేహశుద్ధి చేశారు. Also Read: నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సైనిక్‌పురిలోని సలీం అనే వ్యక్తి ఆర్.ఎస్. డిజిటల్ ఫోటోస్టుడియో నిర్వహిస్తున్నాడు. మంగళవారం అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక ఫోటో తీయించుకునేందుకు స్టుడియోకి వెళ్లింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో సలీం ఆమెపై అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించడంతో కంగారుపడిన బాలిక కేకలు వేసుకుంటూ స్టుడియో నుంచి బయటకు పరుగులు తీసింది. Also Read: స్థానికులు ఏం జరిగిందని ఆరా తీయగా బాలిక అసలు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహం చెందిన వారు సలీంను స్టుడియో నుంచి బయటకు లాక్కొచ్చి చితకబాదారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సలీంను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి తీవ్రంగా గాయపడటంతో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సలీంను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3bO2j3t
0 Comments