ప్రజా చైతన్య యాత్ర పేరిట టీడీపీ అధినేత బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 13 జిల్లాల్లో 100 నియోజకవర్గాలను కవర్ చేసేలా బాబు పర్యటనను ప్లాన్ చేశారు. వైసీపీ అరాచక, అసమర్థ, అవినీతి పాలనపై రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారని... వైసీపీ ప్రభుత్వ పాలనా విధానాలు, ప్రజలను మోసగిస్తున్న తీరు, వాటివల్ల రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలపై ప్రజలకు అవగాహన కలిగించడానికి ప్రజా చైతన్యయాత్రను శ్రీకారం చుట్టినట్టు బాబు తెలిపారు. కాగా చంద్రబాబు బస్సు యాత్రపై వైఎస్సార్సీపీ ఎంపీ సెటైర్లు వేశారు. బాబును చూస్తే తనకు జాలేస్తోందన్నారు. ‘‘గట్టిగా చప్పట్లు కొట్టి తనను ఉత్సాహపరచాలని 70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది. కార్యకర్తలు మరీ స్పందన లేకుండా మారిపోతే ఎలా? అడిగినందుకైనా కాసేపు క్లాప్స్ కొట్టొచ్చుగదా. చివరకు స్లోగన్స్ ఇచ్చి అందరూ తనతోనే ఉన్నారని భ్రమపడి ఇంకో చోటుకి బయలుదేరుతున్నాడ’’ని విజయసాయి ట్వీట్ చేశారు. అంతకు ముందు మరో ట్వీట్ చేసిన వైఎస్సార్సీపీ ఎంపీ.. ‘‘బాబు వెళ్లి కలిసిన వారంతా నడినెత్తిన శని తాండవం చేసినట్టు గిలగిలా కొట్టుకుంటున్నారు. తీహార్ జైలు కెళ్లిన వారు, ఐటీ, ఈడీ నోటీసులందుకున్న పెద్దలు.. సారు ‘స్పర్శ’ కరోనా వైరస్ కంటే పవర్ ఫుల్ అని నిర్ధారించారు. అహ్మద్ పటేల్ లాంటి ఉద్దండులకూ హవాలా ఉచ్చు బిగిసిందంటే మామూలు విషయమా?’’ అని కామెంట్ చేశారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/38IhhpL
0 Comments