మహారాష్ట్రలోని సంగ్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిన 56 ఏళ్ల ఓ వ్యక్తి కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన కుమారుడిని ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పాడు. కుటుంబ బాధ్యతలు చూసుకోవాల్సిందిగా సూచించాడు. సంగ్లి జిల్లా మిరాజ్‌లోని హాస్పిటల్‌లో కొవిడ్ కేర్ విభాగంలో ఈ దారుణం జరిగింది. బాధితుడు హాస్పిటల్ బెడ్‌పై కూర్చొని గొంతు కోసుకున్న దృశ్యాలు వార్డులో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కరోనా సోకడంతో మనస్తాపానికి గురైన బాధితుడు.. శనివారం (సెప్టెంబర్ 26) అర్ధరాత్రి దాటిన తర్వాత అత్యంత భయానకంగా తన ప్రాణాలు తీసుకున్నాడు. కత్తితో అతడు గొంతు కోసుకుంటుండగా.. ఆ అలికిడికి అప్రమత్తమైన హాస్పిటల్ సిబ్బంది అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. వైద్యులు వెంటనే అతడిని ఆపరేషన్ థియేటర్‌కు తరలించి బతికించే ప్రయత్నం చేశారు. కానీ, వారు ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. కరోనా కారణంగానే అతడు ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని వెల్లడించారు. ఐసీయూ కిటికీలో నుంచి దూకి మరొక రోగి.. ఔరంగాబాద్‌లో మరో రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సెప్టెంబర్ 25న కరోనాతో ప్రభుత్వ హాస్పిటల్‌లో చేరిన 42 ఏళ్ల ఓ వ్యక్తికి ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు అతడు హాస్పిటల్‌లో తన బెడ్డు పక్కన ఉన్న కిటికీలో నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మహారాష్ట్రలో ఒకే రోజు ఇద్దరు కరోనా రోగులు ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాశంగా మారింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/347OqKo
0 Comments