Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 27 February 2021

నవ్వుతూ ఆత్మహత్య.. ప్రేమిస్తే నిందించొద్దు, జీవితాన్ని ఆనందంగా ముగించింది!

లాకీ అమ్మాయి. చిన్న వయసులోనే జీవితంలో పెద్ద అనుభవాన్ని సంపాదించింది. తల్లిదండ్రుల నుంచి, స్నేహితుల నుంచి ప్రేమను పొందింది. కానీ, అన్నీ అనుకున్నట్లే జరగవుగా. అలా జరిగితే జీవితం ఎందుకవుతుంది..? తన నుంచి ప్రేమను పొందాలే గానీ, తన వల్ల ఎవరూ ఇబ్బందిపడకూడదు. అలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని.. తనే అడ్డు తప్పుకుంది. అందుకోసం ప్రాణత్యాగం చేసింది. అది తన మంచితనం వల్ల వచ్చిన నిర్ణయం కావొచ్చు, మరొకటి కావొచ్చు.. కానీ, చావును ఆనందంగా ఆహ్వానించింది. ఏమాత్రం బెరుకు లేకుండా..! జీవితాన్ని ఆనందంగా అనుభవించాలట. అందుకే తన చివరి క్షణాల్లోనూ సంతోషాన్నే పంచింది. ఆమె షేర్ చేసిన వీడియో చూడండి.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఆ మహిళ పేరు అయేషా. పెళ్లికి ముందు వరకూ ఆమె జీవితం సాఫీగా సాగింది. రాజస్థాన్‌లోని జాలోర్‌కు చెందిన ఆరిఫ్‌ ఖాన్‌తో 2018లో ఆమెకు వివాహం జరిగింది. మంచి సంబంధం అని భావించి అయేషా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ తాహతుకు మించి డబ్బును కట్నంగా ముట్టజెప్పారు. కానీ, పెళ్లైన కొద్ది రోజుల నుంచే అయేషాకు భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం అత్తింటివారు అయేషాను వేధించారు. టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే అయేషా తండ్రికి అప్పటికే తలకు మించిన భారం అయింది. డబ్బు తీసుకొస్తే గానీ, నా గడప తొక్కొద్దని చెప్పి అయేషాను ఆమె భర్త ఆరిఫ్‌ ఖాన్‌ 2019లో పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతగా నచ్చజెప్పినా, బంధువులతో చెప్పించినా ఆరిఫ్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. ఓ రోజు ఆరిఫ్ కోపంగా తన భార్యతో కఠినమైన మాట చెప్పాడు.. ‘నా వద్దకు రాకుండా ఏదైనా నదిలో దూకి చావు’ అని. అయేషాకు అదే బెటర్ అనిపించింది. తల్లిదండ్రులను ఇంకా ఇబ్బందులకు గురి చేయడం ఎందుకని భావించేదేమో.. అనుకున్నంత పని చేసి చూపింది. సబర్మతీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు బ్రిడ్జిపై కూర్చొని ఓ సెల్ఫీ వీడియోను తీసింది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను సంతోషంగా వెళ్లిపోతున్నానని, తన గురించి ఎవరూ బాధ పడొద్దని కోరింది. ‘నా పేరు అయేషా.. ఈ జీవితం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నాన్నా.. మీరు ఇంకెంత కాలం పోరాడతారు? అయేషా.. కొట్లాటల కోసం పుట్టలేదు. ఆరిఫ్‌‌ను ప్రేమిస్తే.. అతడిని ఇబ్బంది పెట్టకూడదు, నిందించకూడదు. అతడికి స్వేచ్ఛ కావాలట. మంచిది.. అతడిని ఇక స్వేచ్ఛగా ఉండనివ్వండి. నా జీవితం ఇంతవరకే ఉన్నట్టుండి. నాకేమీ బాధ లేదు. నేను సంతోషంగా ఉన్నా.. అల్లాను కలవబోతున్నా..’ అని అయేషా అంది. ‘నా తప్పేముంది. జీవితంలో నాకు మంచి తల్లిదండ్రులు లభించారు. మంచి స్నేహితులు దొరికారు. దేవుడు ఇచ్చిన ఈ అందమైన జీవితాన్ని సంతోషంగా అనుభవించాలి. కానీ, కొన్ని ఆశించినట్లు ఉండవు. నాకు స్వర్గం కూడా దొరుకుతుందో, లేదో.. చలో.. అల్విదా’ అంటూ అయేషా తన వీడియో ముగించింది. అనంతరం సబర్మతీ నదిలో దూకేసింది. వీడియో: అయేషా చివరి మాటలు.. వీడియో చూడగానే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఫైర్‌ బ్రిగేడియర్స్‌ సాయంతో సబర్మతీ నదిలో గాలించి అయేషా మృతదేహాన్ని వెలికితీశారు. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయేషాను వేధింపులకు గురిచేసి, ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పిన భర్తను అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. Also Read: ★ ★


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3r4uRNo

No comments:

Post a Comment