Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 28 August 2019

కశ్మీర్‌పై పాక్ ప్రధానికి భుట్టో ఆసక్తికర సూచన.. భవిష్యత్తును ఊహించారా?

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను భారత ప్రభుత్వం రద్దుచేయడంతో పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై భారత్‌తో అణు యుద్ధానికి కూడా వెనుకాడబోమని పాకిస్థాన్ ప్రధాని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే, కశ్మీర్ విషయంలో ఇమ్రాన్ అనుసరిస్తోన్న తీరుపై పాక్‌లో విపక్షాలు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం శ్రీనగర్‌ మాట అటుంచింతే , ముజఫరాబాద్‌లు చేజారిపోకుండా చూసుకోవాలని ప్రధానికి సలహా ఇస్తున్నాయి. దీనిపై తాజాగా, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. శ్రీనగర్‌ గురించి మర్చిపోయి పీఓకే, ముజఫరాబాద్‌లపై ఇమ్రాన్ దృష్టిపెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. సోమవారం రావల్పిండిలోని అడియాల్లో జైల్లో ఉన్న తన తండ్రి అసిఫ్ అలీ జర్దారీ, మేనత్త ఫ్రయాల్ తల్పూర్‌లని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్ అంశంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించే ఆలోచన తనకు లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేసిన మర్నాడే ఇమ్రాన్‌పై ఆయన విరుచుకుపడ్డారు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ-7 దేశాల సదస్సు జరగుతుండగానే భారత్‌తో అణు యుద్ధానికి సిద్ధమని ఇమ్రాన్ ప్రకటించడంతో అగ్రరాజ్యం మరింత మండిపడుతోంది. ‘కశ్మీర్ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, భారత ప్రధాని మోదీ ఓ విధానంతో ముందుకెళ్లి వారి దేశంలో కలుపుకుంటే.. మొద్దునిద్రలో ఉన్న ఇమ్రాన్.. దేశ ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమై, తన రాజకీయ ప్రత్యర్థుల నోరు బలవంతంగా నొక్కే ప్రయత్నం చేస్తున్నారు’ అని బిలావల్ ధ్వజమెత్తారు. శ్రీనగర్‌ను ఎలా స్వాధీనం చేసుకోవాలనేది కశ్మీర్‌పై పాక్ తొలి విధానం.. అయితే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ అసమర్ధ వైఖరి, దురాశ కారణంగా మన విదేశాంగ విధానం పీఓకేను ఎలా కాపాడుకోవాలనే ప్రమాదంలో ఉందని వ్యాఖ్యానించారు. ఆర్డర్ ఆఫ్ జాయోద్ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోదీకి యూఏఈ ప్రభుత్వం ప్రదానం చేయడంపై మీ స్పందనేంటని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బిలావల్ స్పందిస్తూ.. దీనికి విఫలమైన పాకిస్థాన్ విదేశాంగ విధానమే కారణమని అన్నారు. మరోవైపు, కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, ఇందులో పాకిస్థాన్‌ సహా ఏ దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ విపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2L0xlJU

No comments:

Post a Comment