
వయోభారంతో అనారోగ్యం బారిన పడిన తల్లిని స్వయానా కన్నకొడుకే శ్మశానానికి చేర్చాడు. ఈ అమానవీయ ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. జగిత్యాల వీక్లీ బజార్‌లో చెట్‌పల్లి నర్సమ్మ(95) వయోభారం కారణంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈమె భర్త 30ఏళ్ల క్రితమే చనిపోగా.. కుమారుడు ధర్మయ్య అద్దె ఇంట్లో ఉంటూ ఆమె ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. నర్సమ్మ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. తల్లి ఇంట్లోనే చనిపోతే ఇంటి యజమానితో మాట పడాల్సి వస్తుందని భయపడిన ధర్మయ్య ఆమె కన్నుమూయక ముందే శ్మశానానికి తరలించాడు. అక్కడ పాడుబడిన ఇంట్లోని ఓ గదిలో తల్లిని ఉంచాడు. ఈ విషయం తెలుసుకుని స్థానికులు చలించిపోయారు. వెంటనే జగిత్యాల ప్రభుత్వాసుపత్రి ఇన్‌ఛార్జ్ సుదక్షిణాదేవికి సమాచారం ఇవ్వడంతో ఆమె అంబులెన్స్ పంపించి నర్సమ్మను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కన్నతల్లిని శ్మశానంలో వదిలేసిన ధర్మయ్యపై స్థానికులకు కోపం వచ్చినా అతడి పరిస్థితి తెలిసి జాలిపడుతున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2NDz3T5
No comments:
Post a Comment