
జిల్లాలో జాతీయ రహదారి రక్తమోడింది. కడప- బెంగళూరు హైవేపై శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మృతిచెందారు. బెంగళూరు నుంచి కడప వైపు వెళ్తున్న కారు కేశాపురం వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కడప పట్టణానికి చెందిన హర్షవర్ధన్, బుజ్జి, భూదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తిని రాయచోటి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో వెలికి తీసేందుకు పోలీసులు చాలా కష్టపడ్డారు. వీరంతా బెంగుళూరులో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ACG531
No comments:
Post a Comment