కోరిక తీర్చాలంటూ కోడలికి వేధింపులు.. కొడుకు చేతిలో దారుణహత్య

కాటికి కాళ్లు చాపుకున్న వయస్సులో కామ కోరికలతో రెచ్చిపోయిన వృద్ధుడు కన్న కొడుకు చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. భార్య కాలం చేయడంతో ఇతర మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా కూతురిలా చూడాల్సిన కోడలిపైనా కన్నేశాడు. కొడుకు లేని సమయంలో తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు. Also Read: యాద్రాద్రి జిల్లా భువనగిరి మండలంలోని బండసోమారం గ్రామానికి చెందిన ఏమల్ల లక్ష్మారెడ్డి, రాధమ్మ దంపతులకి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. చిన్న కుమారుడు ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోగా.. కూతురుకి వివాహమై అత్తింట్లో ఉంటోంది. పెద్ద కుమారుడు మాధవరెడ్డి మనస్పర్థలతో మొదటి భార్యకు విడాకులిచ్చేసి.. 4 సంవత్సరాల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వృద్ధాప్యంలో ఉన్న లక్ష్మారెడ్డి పరాయి స్త్రీలతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నారు. ఈ క్రమంలోనే కొడుకు లేని సమయంలో కోరిక తీర్చాలంటూ కోడలిని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. Also Read: దీంతో మాధవరెడ్డి భార్యతో వేరు కాపురం పెట్టాడు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోని లక్ష్మారెడ్డి అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్లి కోడలిని వేధిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే మాధవరెడ్డి మూడెకరాల పొలంలో సాగుచేసిన ధాన్యాన్ని స్థానిక రామస్వామిగుట్టపై ఆరబోశారు. శుక్రవారం ఆ గుట్టపైకి మాధవరెడ్డి వెళ్లగా అతడి తండ్రి మరో మహిళతో రాసలీలలు కొనసాగిస్తూ కనిపించాడు. ఈ వయస్సులో ఇలాంటి పనులేంటని తండ్రిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే మాధవరెడ్డి తండ్రిని గెంటేయడంతో బండరాయిపై పడి తల పగిలి చనిపోయాడు. దీంతో అతడిని భువనగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై రాధమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OCnID2

Post a Comment

0 Comments