వెటర్నరీ డాక్టర్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత.. కేసీఆర్ ప్రకటన చేయాలంటూ డిమాండ్

శివారులో వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణంగా చంపేసిన ఘటనపై ఆగ్రహజ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఆమెకు న్యాయం జరగాలంటూ దేశవ్యాప్తంగా మహిళా, ప్రజా, విద్యార్థి సంఘాలతో పాటు అనేక వర్గాలు ఆందోళన చేపడుతున్నాయి. మరోవైపు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చే నేతలతో ఆమె ఇంటి వద్ద రద్దీ నెలకొంది. Also Read: అయితే ఈ ఘటనపై కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలతో పాటు, దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబానికి న్యాయం జరిగేవరకు మీడియాతో పాటు రాజకీయ నాయకులెవరూ అక్కడికి రావొద్దని కాలనీవాసులు బోర్డు పెట్టారు. ఆమె ఇంటి గేటుకు తాళం వేసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తున్నారు. Also Read: Also Read: ప్రియాంక కుటుంబసభ్యులను కలవడానికి ఎవరూ రావొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులను కూడా లోనికి అనుమతించబోమని హెచ్చరిస్తున్నారు. ఆదివారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి బృందాన్ని గేటు వద్ద కాలనీవాసులు అడ్డుకున్నారు. దీంతో వారు వెనుదిరిగారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసేవరకు ఆందోళన విరమించబోమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OAfwDo

Post a Comment

0 Comments