హైదరాబాద్ నుంచి వెళ్లి వైజాగ్ బీచ్‌లో ఆత్మహత్యాయత్నం.. చివరికి

హైదరాబాద్‌లో రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి(22) విశాఖ నగరంలో ప్రత్యక్షమైంది. సముద్ర తీరంలో శుక్రవారం ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా అరిలోవ పోలీసులు ఆమెను రక్షించారు. హైదరాబాద్‌లో అదృశ్యమైన యువతి విశాఖకు చేరుకున్నట్లు పక్కా సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. శుక్రవారం ఆమె బీచ్ వద్ద ఉన్నట్లు తెలియడంతో బీచ్‌ పెట్రోలింగ్‌ పోలీసులు గాలించారు. Also Read: శుక్రవారం ఉదయం తెన్నేటిపార్కు సమీపంలో ఆమె కెరటాల వైపు వెళుతుండగా మొబైల్‌ పెట్రోలింగ్‌లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ నీలకంఠం, జీపు డ్రైవర్ చూసి అప్రమత్తమయ్యారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆమెను సముద్రంలోకి వెళ్లకుండా ఆపారు. ఆమె వివరాలు కనుక్కొని కంట్రోల్‌ రూమ్‌కి సమాచారమిచ్చారు. తాను అమెజాన్‌ సంస్థలో కొద్దికాలం పాటు పనిచేశానని, తల్లిదండ్రులు తన మాటకు విలువ ఇవ్వడం లేదన్న ఆవేదనతోనే ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు యువతి చెప్పింది. Also Read: ఈ నెల 27న తాను విశాఖ వచ్చానని, ఆత్మహత్య చేసుకోవడానికి మెడపై కత్తితో కోసుకోవడానికి ప్రయత్నించినట్లు తెలిపింది. అయితే ధైర్యం చాలక ఆ ప్రయత్నం విరమించుకున్నానని, తిరిగి ఆత్మహత్య చేసుకునేందుకే బీచ్‌కు వచ్చినట్లు తెలిపింది. దీంతో పోలీసులు అమెకు కౌన్సెలింగ్ ఇచ్చి విశాఖలోని బంధువులకు అప్పగించారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2DvLA56

Post a Comment

0 Comments