ఓ వైపు మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా ప్రజలు రోడ్లెక్కి నిరసనలు చేస్తుంటే.. కామాంధులు మాత్రం తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక , దారుణహత్య ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబిలుకుతున్నాయి. ఈలోగా దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. Also Read: ఢిల్లీలోని గులాబి బాగ్ ప్రాంతంలో 55ఏళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి గొంతు నులిమి చంపేశాడు. కిషన్‌గంజ్ కాలనీకి చెందిన ధర్మరాజ్(22) శుక్రవారం రాత్రి ఆ మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడి ప్రాణం తీశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఆ మహిళ తనపై ఉమ్మి వేసినందునే ఈ దారుణానికి పాల్పడినట్లు యువకుడు పోలీసులకు చెప్పాడు. Also Read: దేశవ్యాప్తంగా అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరసనలు సాగుతున్న వేళ దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read: Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33DGe29
0 Comments