అధినేత పర్యటనలో జేబుదొంగలు హల్‌చల్ చేశారు. చిత్తూరు జిల్లాలో పర్యటించేందుకు ఈరోజు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా చాలామంది పవన్‌తో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. ఇదే అదనుగా జేబుదొంగలు తమ చేతికి పనిచెప్పారు. Also Read: ఈ ఘటనలో సుమారు 35-40 మంది కార్యకర్తల పర్సులు, సెల్‌ఫోన్లు మాయమైనట్లు గుర్తించారు. దీంతో బాధితులంతా ఎయిర్‌పోర్ట్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయితే ఇది తమ పరిధిలోకి రాదని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. దీంతో బాధితులంతా రేణిగుంట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కొందరు జేబుదొంగలు కార్యకర్తల్లా నటించి తమ వస్తువులను దొంగిలించారని, నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. Also Read: మరోవైపు బాధితుల్లో జనసేన కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పవన్‌కు ఘనస్వాగతం పలికిన తర్వాత తమ పర్సులు, సెల్‌ఫోన్లు మాయమైనట్లు కీలక నేతలు కార్యకర్తల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఈ విషయాన్ని వారు పవన్‌కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్‌కళ్యాణ్ నేటి 6వ తేదీ వరకు రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 'జనసేన ఆత్మీయ యాత్రలో' భాగంగా సీమ సమస్యలపై రైతాంగం, మేధావులతో ఆయన చర్చించనున్నారు. అయితే పవన్‌కళ్యాణ్ సీమ పర్యటన తొలిరోజే ఇలాంటి ఘటన జరగడం పార్టీ శ్రేణులను మాత్రం నిరాశపరిచింది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33B5ypz
0 Comments