వివాహితపై బావ అత్యాచారం... ట్రిపుల్‌ తలాక్ చెప్పేసిన భర్త

దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. మహిళలకు బయటే కాదు ఇంట్లోనూ రక్షణ లేకుండా పోతోంది. ఎందరో అమాయక మహిళలు బంధువుల చేతుల్లోనే మోసపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వివాహితలపై భర్త సొంత సోదరుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం భర్తకు చెప్పగా అండగా నిలవాల్సింది పోయి ఆమెకు చెప్పేశాడు. Also Read: రాంపూర్‌ పరిధిలోని డోనక్‌పురి తాండాకు చెందిన మహిళకు ఓ వ్యక్తితో ఏడు సంవత్సరాల క్రితం డాడియల్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆమె భర్త ఢిల్లీలో హోటల్‌ నిర్వహిస్తుండగా, ఆమె పిల్లలతో కలిసి గ్రామంలో నివసిస్తోంది. దీన్ని అలుసుగా తీసుకున్న భర్త సోదరుడు ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పిల్లలను చంపేస్తానని బెదిరిస్తూ ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. Also Read: ఈ విషయాన్ని బాధితురాలు ఇటీవల ఇంటికొచ్చిన భర్తకు చెప్పింది. అయితే భర్త తనకు అండగా ఉంటాడనుకున్న ఆమె ఆశలు క్షణాల్లో ఆవిరయ్యాయి. అత్యాచారానికి గురైన భార్యతో కాపురం చేయబోనంటూ ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పేసి ఇంట్లో నుంచి గెంటేశాడు. దీంతో బాధితురాలు తన పుట్టింటి వారి సాయంతో అజీమ్‌ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సోదరుడు తనపై అత్యాచారం చేస్తే అత్తమామలు అతడికే మద్దతు పలికారని, ఇప్పుడు భర్త కూడా తనకు అన్యాయం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చి ఫిర్యాదులో పేర్కొంది. ఆ నలుగురిపై కఠినచర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/34CQol5

Post a Comment

0 Comments