ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలు చేసినా మహిళలపై అఘాయిత్యాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. అమ్మాయిలకు సమాజంలోనే కాదు... ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతోంది. కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి ఆమెపైనే దారుణానికి ఒడిగట్టాడు. కూతురు అన్న మమకారం కూడ లేకుండా గొలుసులతో బంధించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కర్కశ ఘటన రాజస్థాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. Also Read: రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి 17 ఏళ్ల కూతురుతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి వేధింపులు భరించలేక భార్య ఏడేళ్ల క్రితమే విడాకులు తీసుకొని వేరే వివాహం చేసుకుంది. వారి కూతురు మాత్రం అప్పటి నుంచి తండ్రితోనే ఉంటుంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ తెలుసుకున్న కూతురు అతడిని నిలదీసింది. కోపంతో రగిలిపోయిన ఆ తండ్రి కూతురని కూడా చూడకుండా ఆమెను గదిలో గొలుసులతో బంధించాడు. అనేకసార్లు పైశాచికంగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: చివరకు కీచక తండ్రి బారి నుంచి తప్పించుకున్న బాలిక నేరుగా మేనమామ ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కన్నతండ్రే తనపై ఏ విధంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడో చెప్పడంతో పోలీసులు సైతం షాకయ్యారు. వెంటనే ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ కామాంధుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OGboBE
0 Comments