విజయవాడ: కూతుళ్లని నీళ్లతొట్టెలో ముంచి.. కసాయి తల్లి ఘాతుకం

బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే వారి పాలిట మృత్యుదేవతగా మారింది. అభం శుభం తెలియని చిన్నారులను కర్కశంగా నీటి తొట్టెల్లో ముంచి దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది. ఇద్దరు బిడ్డలను కిరాతకంగా చంపేసి తల్లి పరారవడంతో ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలోని చందర్లపాడు మండలం ముప్పాళ్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ఆడపిల్లలను కన్నతల్లే కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి ఆవరణలోని వరల బావిలో ఒకరిని, నీటి తొట్టెలో మరొకరిని ముంచి ఊపిరాడకుండా చేయడంతో చిన్నారులు విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచారు. అనంతరం చిన్నారుల తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. Also Read: సంత నుంచి ఇంటికొచ్చిన మహిళ మామ చేతులు కడుక్కుందామని తొట్టె వద్దకు వెళ్లడంతో విగతజీవిగా పడి ఉన్న తన మూడేళ్ల మనవరాలిని చూసి షాక్‌కు గురయ్యాడు. ఆ పక్కనే ఉన్న వరల బావిలో నాలుగేళ్ల మనవరాలు కూడా చనిపోయి కనిపించింది. చిన్నారుల తల్లి కూడా కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారుల మృతదేహాలను పరిశీలించారు. Read Also: కన్నతల్లే ఇద్దరు బిడ్డలను నీటితొట్టెల్లో తోసి చంపేసి.. అక్కడి నుంచి పరారై ఉంటుదని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. బిడ్డలను చంపేసిన తల్లి.. తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిందా? లేక మరేవైనా కారణాలతో బిడ్డలను హత్య చేసిందా? అని తెలుసుకునే పనిలో పడ్డారు. బిడ్డల తల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2xSyKy0

Post a Comment

0 Comments