అప్పులకు బలైన కుటుంబం.. ముగ్గురి ఆత్మహత్య.. శ్రీకాకుళం జిల్లాలో విషాదం

అప్పులు ఓ కుటుంబాన్ని మింగేశాయి. తలకు మించిన భారం కావడం.. తిరిగి తీర్చే దారి కనిపించకపోవడంతో ఓ కుటుంబ పెద్ద దారుణ నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబంతో సహా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తమ కూతురుతో సహా భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి చేసుకున్న ఘటన జలుమూరు మండలం కొత్తపేట గ్రామంలో జరిగింది. అప్పులిచ్చిన వారి వేధింపులు ఎక్కువవడంతో దిక్కుతోచని స్థితిలో భార్యాభర్తలు కళావతి, శంకర్రావ్ తమ కుమార్తె గీతాంజలితో సహా పురుగుల మందు తాగారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని హుటాహుటిన నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2WsZ786

Post a Comment

0 Comments