బీటెక్ విద్యార్థినిపై నలుగురి అఘాయిత్యం.. రాజాంలో కలకలం

ఎన్ని కఠిన చట్టాలు వస్తున్నా మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా రాజాంలో కామాంధులు రెచ్చిపోయారు. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినిని అపహరించి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారానికి యత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా హింసించారు. Also Read: బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కామాంధుల దాడితో గాయపడిన యువతిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read: ఇంజినీరింగ్ చదువుతున్న యువతి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాజాంలో తీవ్ర కలకలం రేపింది. ఇటీవలే హైదరాబాద్ నగర శివారులో వెటర్నరీ డాక్టర్‌పై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి, దహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అన్నివర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలోనే ఈ ఘటన జరగడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/35Txfv8

Post a Comment

0 Comments