బెంగాల్ బాలికలతో గుట్టుగా వ్యభిచారం...ఇద్దరు బ్రోకర్లు, నలుగురు విటుల అరెస్ట్

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోనే గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌‌ను పోలీసులు పట్టుకున్నారు. ఖండగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎయిమ్స్ నగర్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం రైడ్ చేసిన పోలీసులు ఇద్దరు బ్రోకర్లు, నలుగురు విటులను అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆరుగురు బాలికలను రక్షించారు. అయితే ఈ సెక్స్ రాకెట్‌ నిర్వాహకులు మాత్రం తప్పించుకుని పారిపోయాడు. Also read: ఈ హోటల్‌ కేంద్రంగా చేసుకుని కొంతకాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేశారు. గదుల్లో కొంత నగదుతో పాటు సెక్స్ టాయ్స్, కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. హోటల్‌ను అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మార్చిన యజమానికి పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. Also read: ఈ నిర్వాహకుడు బెంగాల్‌లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మహిళలను మాయమాటలతో నమ్మించి వ్యభిచార కూపంలోకి లాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. భువనేశ్వర్‌లో పలు హోటల్‌తో పాటు అనేక నివాస ప్రాంతాల్లోనూ వ్యభిచారం గుట్టుగా సాగుతోందని పోలీసులు చెబుతున్నారు. మైనర్ బాలికలతో పాటు వివాహం అయిన మహిళలను కూడా ప్రలోభపెట్టి వేశ్యలుగా మారుస్తున్నారని తెలిపారు. సెక్స్ రాకెట్‌ నిర్వాహకుడితో పాటు రైడ్‌లో దొరికిన ఆరుగురు వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. Also read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2DD7Cmp

Post a Comment

0 Comments