Pawan Kalyan పవర్ బ్యాంకు లాంటోడు: వైసీపీ ఎంపీ

రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధినేత .. తిరుపతిలో హిందూ రాజకీయ నేతల గురించి, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నుంచి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ కులం, మతం గురించి.. హిందూ నాయకుల గురించి పవన్ చేసిన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ఈ విషయంలో బీజేపీ నేతలు పవన్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ కూడా పవన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. జనసేనానిని విజయసాయి పవర్ బ్యాంక్‌తో పోల్చారు. ‘‘పవన్ కళ్యాణ్ సెల్‌ఫోన్‌కు ‘పవర్ బ్యాంక్’ లాంటోడు. చార్జింగ్ సదుపాయం లేని చోట పవర్‌ బ్యాంక్ మిడిసిపడుతోంది. అందులో కరెంటు దిగి పోయాక మళ్లీ చంద్రబాబో, ఇంకొకరో చార్జింగ్ నింపాలి. పవర్‌ బ్యాంక్ ఎప్పుడూ తాత్కాలిక అవసరానికి పనికొచ్చేదే తప్ప తనకు తాను పవర్ జనరేట్ చేయలేద’’ని విజయసాయి ట్వీట్ చేశారు. ‘‘ఎలక్షన్లలో ప్రజలు పొర్లించి కొట్టినంత పనిచేసినా సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడు. యాక్టర్‌ను చూద్దామని నలుగురు పోగవగానే రెచ్చిపోయి డైలాగులు వదుల్తున్నాడు. రాజకీయాలంటే ప్యాకేజి కోసం అమ్ముడు పోవడం కాదు. ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్లిపోవడం అంతకంటే కాదు’’ అని పవన్‌ను ఉద్దేశించి విజయసాయి మరో ఘాటైన ట్వీట్ చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2RdATvP

Post a Comment

0 Comments