
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బస్సు నదిలో బోల్తా పడటంతో 24 మంది దుర్మరణం చెందారని సమాచారం. పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా బుండి జిల్లాలోని లఖేరీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జి పై నుంచి బస్సు అదుపు తప్పి మెజ్ నదిలోకి దూసుకెళ్లడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కోటా లాల్సాత్ మెగా హైవే పైన ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ఉన్నారని సమాచారం. కోటా నుంచి సవాయ్‌మాధోపూర్ వెళ్తుండగా.. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో నదిలో బస్సు పడిపోయిందని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండేళ్ల క్రితం రాజస్థఆన్‌లోని దుబిలోనూ ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. 2017 డిసెంబర్లో బస్సు బ్రిడ్జి మీది నుంచి నదిలో పడిపోవడంతో 12 మంది చనిపోగా 24 మంది గాయపడ్డారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2vjySWl
No comments:
Post a Comment