Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 26 February 2020

ఊటీ వెళ్లొచ్చేసరికి ఇళ్లంతా లూటీ.. హైదరాబాద్‌‌లో 32తులాల బంగారం చోరీ

హైదరాబాద్‌ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ప్రాంతంలో నివసించే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఇంటిని దోచుకుపోయారు. పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు చోరీకి పాల్పడ్డారు. పెళ్లి రోజు వేడుకలు జరుపుకునేందుకు దంపతులు ఊటీకి వెళ్లడంతో చోరులు వారింటిని గుల్ల చేశారు. Also Read: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఇంద్రపాలెం‌కు చెందిన అనుసూరి శివశంకర్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి నల్లకుండలోని తిలక్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ నెలలో వారి పెళ్లిరోజు ఉండటంతో వేడుకలు జరుపుకునేందుకు పర్యాటక ప్రాంతమైన తమిళనాడులోని ఊటీకి వెళ్లారు. Also Read: సోమవారం ఉదయం కిటికీ తలుపులు తీసి ఉండటంతో ఇంటి యజమాని ప్రసాద్ ఆయనకు ఫోన్ చేసి ఎప్పుడొచ్చారని అడిగాడు. అయితే తామింకా ఇంటికి రాలేదని, మంగళవారం ఉదయం వస్తామని శివశంకర్‌ చెప్పడంతో యజమాని కంగుతిన్నాడు. అయితే కిటికీ తలుపులు తెరిచి ఉండటంతో వచ్చేసి ఉంటారనుకున్నానని యజమాని చెప్పడంతో అతడికి అనుమానం కలిగింది. Also Read: మంగళవారం ఉదయం భార్యతో కలిసి ఇంటికి చేరుకున్న శివశంకర్ ఇంట్లోని వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉండటాన్ని గమనించాడు. అనుమానంతో బీరువా తెరిచి చూడగా 32 తులాల బంగారంతో పాటు కిలో వెండి నగలు కనిపించలేదు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2viJyV9

No comments:

Post a Comment