స్వలింగ సంపర్కానికి అంగీకరించలేదన్న కోపంతో ఇద్దరు మహిళలు 21ఏళ్ల యువతిపై పైశాచికానికి పాల్పడ్డారు. మధ్య ప్రాచ్యంలోని సైప్రస్ దేశానికి చెందిన సోనా(21) అనే యువతి కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం ఫ్రాన్స్ రాజధాని చేరుకుంది. అక్కడ ఓ రెస్టారెంట్లో పని చేస్తూ జీవిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ మహిళ(35) పరిచయమైంది. ఇద్దరికీ సాన్నిహిత్యం పెరగడంతో తరుచూ కలుసుకుని మాట్లాడుకునేవారు. Also Read: ఈ క్రమంలోనే సోనాపై ఆ మహిళ మనసు పారేసుకుంది. స్వలింగ సంపర్కురాలైన ఆమె తనతో సంబంధం పెట్టుకోవాలని సోనాను కోరింది. దీనికి ఆమె నిరాకరించడంతో ఎలాగైనా తనని దక్కించుకోవాలని ప్లాన్ వేసింది. గతవారం పబ్ నుంచి బయటకు వస్తున్న సోనాను రోజీ తన ఫ్రెండ్‌తో కలిసి ఆ మహిళ అడ్డగించింది. బలవంతంగా కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ సోనాను తీవ్రంగా కొట్టి సెక్స్టాయ్(కృతిమ పురుషాంగం)తో ఆమెపై అత్యాచారానికి పాల్పడింది. తర్వాత రోజీ కూడా అదేవిధంగా బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడింది. Also Read: అపస్మారక స్థితిలోకి చేరుకున్న సోనాను ఆ మహిళలిద్దరూ ఓ బస్టాప్ దగ్గర నగ్నంగా పడేసి వెళ్లిపోయారు. స్థానికుల సపర్యలతో తేరుకున్న బాధితురాలు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3bhDDQH
No comments:
Post a Comment