తెలంగాణలో మరో ఘోర ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఇంటి ఆడపిల్లపై తాత, మేనమామ అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఇద్దరు కామాంధులు రెండేళ్లుగా తనపై సాగిస్తున్న కీచకపర్వాన్ని బాధితురాలు తల్లికి చెప్పడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. Also Read: బండ్లగూడ మహ్మద్ నగర్‌కు చెందిన షేక్ అఫ్సర్(70) కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతడి మనవరాలు(19) చిన్నప్పటి తాత ఇంట్లోనే ఉంటోంది. ఆమెకు యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి కన్నేసిన ఆఫ్సర్ రెండేళ్ల నుంచి బెదిరించి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అతడి కుమారుడు, యువతికి మేనమామ అయిన షేక్ సిద్ధిఖ్ సైతం ఆమెను బెదిరించి తరుచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. కీచకులుగా మారిన తండ్రీకొడుకులు ఆమెపై తరుచూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. Also Read: ఇటీవల ఇంటికి వచ్చిన తల్లికి బాధితురాలు విషయం చెప్పడంతో ఆమె షాకైంది. తన కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడుతున్న తండ్రి, సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2UriUnu
No comments:
Post a Comment