Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 6 February 2020

అయోధ్యలో ఆలయ నిర్మాణానికి కేంద్రం విరాళం ఎంతో తెలుసా?

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ‘’ పేరుతో ఓ ట్రస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ప్రముఖ న్యాయ నిపుణుడు పరాశరన్‌ను నియమించగా, ఇందులో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. ఒక దళితుడు శాశ్వత సభ్యుడిగా కొనసాగుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కాగా, రామమందిర నిర్మాణ ట్రస్ట్ కోసం ప్రభుత్వం ఒక రూపాయిను విరాళంగా ఇచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కేంద్రం తరఫున హోం శాఖ కార్యదర్శి డి.ముర్ము ఈ రూపాయి విరాళాన్ని ట్రస్ట్‌ సభ్యులకు అందజేశారు. రామమందిర నిర్మాణం కోసం ఎవరైనా విరాళాలు నగదు, ఆస్తుల రూపంలో అందజేయవచ్చని, వీటిని ఎలాంటి షరతులు విధించకుండా స్వీకరిస్తామని ట్రస్టు తెలిపింది. ప్రస్తుతం ట్రస్ట్ ఛైర్మన్ పరాశరన్‌ ఇంటి నుంచే ట్రస్ట్ కార్యకలాపాలు కొనసాగుతాయని, త్వరలోనే అధికారిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామని అధికారులు వెల్లడించారు. రామమందిర నిర్మాణం కోసం మూడు నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు గత నవంబరు 9న ఆదేశాలు జారీచేసింది. అయోధ్యలోని బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి విషయంలో తుది తీర్పు వెలువరించిన సుప్రీం.. వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని స్పష్టం చేసింది. కాగా, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం పేరుతో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆలయ నిర్మాణంలో అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OtZrPe

No comments:

Post a Comment