Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 6 February 2020

తల్లిని దారుణంగా చంపి.. ప్రియుడితో అండమాన్‌లో‌ హనీమూన్

నవమాసాలు కని పెంచి తల్లిని దారుణంగా చంపేసి పరారైన యువతిని పోలీసులు పట్టుకున్నారు. ప్రేమకు అడ్డు చెప్పిందన్న కారణంతోనే ఆమె కన్నతల్లిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తల్లిని చంపిన తర్వాత ప్రియుడితో పాటు పారిపోయిన ఆమె అండమాన్ దీవుల్లో తిరుగుతూ పోలీసులకు పట్టుబడింది. Also Read: బెంగళూరుకు చెందిన నిర్మల (55) అనే మహిళకు కూతురు అమృత, కొడుకు ఉన్నారు. బీటెక్ చదివిన అమృత జల్సాల బాట పట్టి అబ్బాయిలతో తిరుగుతుండేది. కూతురు దారి తప్పుతోందని భావించిన నిర్మల.. బుద్ధిగా ఉండాలంటూ అనేకసార్లు హెచ్చరించింది. ఈ క్రమంలోనే అమృత ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు తెలుసుకుని చీవాట్లు పెట్టింది. ప్రేమకు స్వస్తి చెప్పి తాను చూపించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో తన ప్రేమకు అడ్డు పడుతున్న తల్లిని చంపేయాలని అమృత ప్లాన్ వేసింది. Also Read: ఆదివారం(ఫిబ్రవరి 2) కూడా ఇదే విషయంపై తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటి తర్వాత నిర్మల తన గదిలోకి వెళ్లి నిద్రపోయింది. అర్ధరాత్రి వేళ తల్లి గదిలోకి వెళ్లిన అమృత కత్తితో ఆమెను పొడిచి చంపేసింది. మరో గదిలో ఉన్న తమ్ముడిపైనా హత్యాయత్నం చేసింది. గాయాలతో ఆ యువకుడు బయటకు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. కన్నతల్లిని చంపేశానన్న పశ్చాత్తాపం కూడా లేకుండా అమృత ప్రియుడితో కలిసి అండమాన్ దీవులకు విహారానికి వెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమృత సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేయగా అండమాన్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో కేఆర్ పురం పోలీసులు బుధవారం అక్కడికి వెళ్లి అమృతతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకొచ్చారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OwVmd8

No comments:

Post a Comment