ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీఏ పల్లి మండలం చిలకమర్రి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మిర్యాలగూడ నుంచి దేవరకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ వేగంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Also Read: ఈ ఘటనలో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయచర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్లనే ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2tqXknM

Post a Comment

0 Comments