ప్రభుత్వ పాఠశాల్లో విషయంలో జగన్ సర్కారు మెత్తబడినట్టు తెలుస్తోంది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు కూడా ఇంగ్లిష్ మీడియం అందించే ఉద్దేశంతో.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ వచ్చే ఏడాది నుంచి నిర్భంద ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ దిశగా చట్టం చేస్తోంది. అసెంబ్లీలో ఈ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందింది. ఏ మీడియంలో చదువుకోవాలనే వెసులుబాటు విద్యార్థులకే ఇవ్వాలని.. సవరణలు సూచిస్తూ బిల్లును మండలి తిప్పి పంపింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధించాలని జగన్ సర్కారు జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుంటుపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల కారణంగా విద్యార్థులు మాతృభాషలో చదువుకునే అవకాశాన్ని కోల్పోతారని, భాషాపరంగా మైనార్టీల హక్కులను కూడా కాలరాసేలా జగన్ సర్కారు ఆదేశాలు ఉన్నాయని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం.. లింగ్విస్టిక్ మైనార్టీ స్కూళ్లలో ఉర్దూ, ఒరియా, కన్నడ, తమిళ భాషల్లో బోధనను కొనసాగించడానికి సుముఖత వ్యక్తం చేసిందని ‘ఆంధ్ర ప్రభ’ కథనాన్ని ప్రచురించింది. దీంతో తెలుగు మినహా మిగతా భాషల్లో బోధనకు మార్గం సుగమమైంది. ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియంలోనే తమ పిల్లలను చదివించాలని కోరుకుంటున్నారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఎవరైనా తల్లిదండ్రులు తెలుగు మీడియం ఎడ్యుకేషన్‌ను కోరుకుంటే.. మండలానికి ఓ తెలుగు మీడియం స్కూల్‌ను ఏర్పాటు చేస్తామని న్యాయస్థానానికి తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు. వాస్తవానికి ప్రతిపక్షాలు కూడా కోరుతున్నది ఇదే. ఇంగ్లిష్ మీడియాన్ని నిర్బంధంగా అమలు చేయడం సరికాదని విపక్షాలు వాదిస్తున్నాయి. మాతృభాషలో చదువుకునే వెసులుబాటును విద్యార్థులకు కల్పించాలని కోరుతున్నాయి. ఏపీలో చదువుకుంటున్న కన్నడ విద్యార్థులు మాతృభాషలో చదువుకునే అవకాశాన్ని దూరం చేయొద్దని కర్ణాటక ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఇటీవలే సీఎం జగన్‌కు లేఖ రాశారు. హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ కృష్ణమోహన్.. జగన్ సర్కారు నిర్ణయం జాతీయ విద్యావిధానానికి అనుగుణం లేదన్నారు. కూడా నిర్బంధ ఇంగ్లిష్ మీడియం బోధన కుదరదని స్పష్టం చేసింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2UpsBmj
No comments:
Post a Comment