ప్రేమ పేరుతో ఓ ఆర్మీ ఉద్యోగి తనను నమ్మించి లొంగదీసుకుని మోసం చేశాడని ఓ యువతి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముత్తుపల్లి గ్రామానికి చెందిన పిట్టు నాగరాజురెడ్డి కొన్నేళ్ల క్రితం ఆన్‌లైన్ వస్తువుల డెలివరీ వ్యాపారం చేశాడు. తన స్నేహితురాలైన యువతికి తన వ్యాపారంలో భాగస్వామ్యం ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఓ వైపు వ్యాపారం కొనసాగిస్తూనే ఇద్దరూ సినిమాలు, షికార్లంటూ విచ్చలవిడిగా తిరిగేవారు. Also Read: కొంతకాలం తర్వాత నాగరాజురెడ్డికి ఆర్మీలో ఉద్యోగం రావడంతో వేరే ప్రాంతానికి వెళ్లాడు. అయినప్పటికీ ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. జీవితంలో స్థిరపడ్డావు కదా.. పెళ్లి చేసుకుందామని యువతి సూచించగా అతడూ సరేనంటూ నమ్మిస్తూ వస్తున్నాడు. గతేడాది డిసెంబర్ నెలలో తనను పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయగా ఆమెను బ్లాక్‌లో పెట్టేశాడు. ప్రియుడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో యువతి అతడి ఇంటికి వెళ్లి నిలదీసింది. Also Read: దీంతో నాగరాజురెడ్డి తల్లిదండ్రులు శివారెడ్డి, ఆదిలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను బెదిరించారు. తన కుమారునికి మంచి ఉద్యోగం వచ్చిందని, మంచి సంబంధం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఈ వ్యవహారంలో అడ్డొస్తే సహించేది లేదని, తమ కొడుకుతో ఇకపై మాట్లాడొద్దని హెచ్చరించారు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి మంగళవారం నిజాంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ ఆర్‌ఎస్ శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2RWo5df
No comments:
Post a Comment