Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 4 February 2020

ఆర్మీలో మహిళా కమాండోలను అంగీకరించడానికి సిద్ధంగాలేరు.. సుప్రీంలో కేంద్రం

మహిళా అధికారులను అంగీకరించడానికి సైన్యంలోని పురుషులు సంసిద్ధంగాలేనందున ఆర్మీ కమాండో పోస్టులకు మహిళలు తగినవారు కాదని కేంద్రం వివరించింది. కుటుంబ అవసరాలతో పాటు వారిని యుద్ధ ఖైదీలుగా తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి శాశ్వత కమిషన్ పొందిన తరువాత కమాండ్ పోస్టింగ్ కోసం మహిళా అధికారుల అభ్యర్ధనను వ్యతిరేకిస్తున్నారని తెలిపింది. అంతేకాదు, ప్రస్తుతం సైన్యంలోని పురుషుల్లో చాలా మంది ప్రధానంగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారేనని, ప్రస్తుత సామాజిక నిబంధనల కారణంగా మహిళా అధికారులను కమాండోగా అంగీకరించడానికి మానసికంగా సిద్ధంగాలేరని పేర్కొంది. అలాగే, వివిధ భౌతిక ప్రమాణాల ఆధారంగా పోస్టింగ్ విషయంలో మహిళలు, పురుషులను సమానంగా చూడలేమని, ఈ విషయంలో పరిమితులున్నాయని స్పష్టం చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగిల ధర్మాసనానికి కేంద్రం తరఫున సీనియర్ న్యాయవాది ఆర్ బాలసుబ్రమణియన్, నీలా గోఖలేలు వాదనలు వినిపించారు. సైన్యంలోని కీలకమైన ఈ పదవులలో మహిళలను నియమిస్తే సాయుధ దళాల గతిశీలతను మారుస్తుందని అభిప్రాయపడ్డారు. శారీరక పరిమితి, మాతృత్వం, పిల్లల సంరక్షణ లాంటి సవాళ్లు మరింత అధికమవుతాయని వాదించారు ఈ వాదనలను మహిళల తరఫున హాజరైన మీనాక్షీ లేఖీ, ఐశ్వర్య భట్టీ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతికూల పరిస్థితుల్లో మహిళలు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని, పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేవేసిన వింగ్ కమాండర్ అభినందన్‌కు మార్గనిర్దేశనం చేసిన ఫ్లైట్ కంట్రోలర్ మింటీ అగర్వాల్ ఉదంతమే నిదర్శనమని, ఆమెకు యుద్ధ సేవా మెడల్ కూడా వచ్చిందని తెలియజేశారు. అంతేకాదు, కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిని మహిళా అధికారి మిథాలీ మధుమిత సమర్ధంగా తిప్పికొట్టిన విషయాన్ని కూడా కోర్టు ముందుంచారు. సాయుధ దళాలకు త్యాగాలు, నిబద్ధత అవసరం.. తరచూ బదిలీల వల్ల కుటుంబం, పిల్లల విద్య, జీవిత భాగస్వామి యొక్క వృత్తిపరమైన అవకాశాలను ప్రభావితం చేస్తుందని కేంద్రం పేర్కొంది. గర్భధారణ సమయంలో మాతృత్వం, వారి పిల్లలు, కుటుంబాల పట్ల బాధ్యతలు, ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ సైనిక అధికారులుగా ఉంటే మహిళా అధికారులు వీటిని అధిగమించడం పెద్ద సవాల్ అని తెలిపింది. ఆర్మీలో 14 ఏళ్లు సేవలందించిన మహిళా అధికారులకు పర్మినెండ్ కమిషన్ హోదా ఇవ్వడానికి కేంద్రం అంగీకరించదని, అంతకు మించితే ఉండదని న్యాయవాది బాలసుబ్రమణియన్ కోర్టుకు తెలిపారు. అంతేకాదు, 14 ఏళ్లు పైబడిన వారికి పర్మినెంట్ కమిషన్ లేకుండా 20 ఏళ్లు సర్వీసులో కొనసాగడానికి అనుమతి ఉంటుందని, ఆ తర్వాత వారికి పెన్షన్ ప్రయోజనాలు అందుతాయన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2GRHtSv

No comments:

Post a Comment