Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 5 February 2020

ఎన్ఆర్సీతో అందరికీ నష్టం.. మేము అంగీకరించం: మహా సీఎం ఉద్ధవ్

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్ట్రార్ (ఎన్‌ఆర్సీ)లపై ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఏఏపై ఆందోళన అనవసరమన్న ఉద్ధవ్.. ఎన్‌ఆర్సీని తమ ప్రభుత్వం అంగీకరించబోదని స్పష్టం చేశారు. దీనిని అమలుచేయడం వల్ల అన్ని మతాల్లోని ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చిన వలసవాదులను దేశం నుంచి తరమేయాలనేది శివసేన పాత డిమాండ్‌ అని తమ అధికార పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ధవ్ పేర్కొన్నారు. భారతీయులైనవారిని దేశం నుంచి సీఏఏ వెళ్లగొట్టదనే ఆత్మవిశ్వాసం తనకుంది, కానీ, హిందువులపై కూడా ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. పొరుగు దేశాల్లో మతపరమైన హింసకు గురై మన దేశానికి వచ్చిన భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న మైనార్టీలెందరనేది తెలుసుకోవడం భారత్ హక్కని అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు, తమ పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలు చాలా ముఖ్యమని, దీని గురించి అందరూ తప్పక తెలుసుకోవాలని అవసరం ఉందన్నారు. ఓ ముఖ్యమంత్రిగా నా రాష్ట్రంలోని ప్రజలను ఎక్కడకు తరలించాలనేది తాను తెలుసుకోవాలి.. ప్రజలకు తగిన గృహాలు లేవని, ఆర్టికల్ 370 రద్దు చేయడంతో వీరంతా కశ్మీర్‌కు లేదా బెంగళూరు, ఢిల్లీకి వెళతారా? అని ప్రశ్నించారు. అనేక మంది కశ్మీరీ పండిట్లు తమ సొంత దేశంలోనే కాందశీకుల్లా కాలం వెళ్లదీస్తున్నారని, భారతీయులను సీఏఏ దేశం నుంచి వెళ్లగొట్టదని అన్నారు. ఇదే సమయంలో ఎన్ఆర్సీ మాత్రం ముస్లింలు, హిందువులపై ప్రభావం చూపుతుందని, దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించదని సీఎం ఉద్ధవ్ పేర్కొన్నారు. ఎన్ఆర్సీతో భారతీయులంతా తాము ఈ దేశ పౌరులమేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది.. అసోంలో 19 లక్షల మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.. వీరిలో 14 లక్షల మంది హిందువులు ఉన్నారన్నారు. ఈ సందర్భంగా సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించడానికి సిద్ధమైన ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేపై ఉద్ధవ్ విమర్శలు గుప్పించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నా లేకున్నా ఎన్ఆర్సీకి వ్యతిరేకమని, ఎవరికీ అన్యాయం జరగడానికి అంగీకరించమన్నారు. ఇ ఇటీవల కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులపై కూడా మహారాష్ట్ర సీఎం విమర్శలు గుప్పించారు. ప్రముఖ గాయకుడు, పాకిస్థాన్‌కు చెందిన అద్నాన్ సమీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. వలసవాదులు వలసవాదులే..వారికి పద్మ అవార్డులతో గౌరవించలేరు.. అక్రమంగా ఉంటున్న వలసవాదులను దేశం నుంచి తరమేయాలన్న బాలాసాహెబ్ ఠాక్రే విధానానికి తాము కట్టుబడి ఉంటామన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2vRjbFX

No comments:

Post a Comment