
దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు, హింసపై కాంగ్రెస్ అధినేత స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే హింసాత్మక ఘటనలు జరిగాయని ఆరోపించారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని.. ఈ ఘటనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. వెంటనే కేంద్ర హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సమీపంలో మూడు రోజుల ఆందోళనల్లో 15మందికిపైగా చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ఈ అల్లర్లను నియంత్రించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నాపోలీసు బలగాలను మోహరించడంలో ప్రభుత్వాలు అలసత్వం వహించిందన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలోనూ కొన్ని ప్రశ్నల్ని సంధించారు. వారం రోజులుగా హోంమంత్రి ఏమయ్యారని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారన్నారు. ఢిల్లీ ఎన్నికలు, తర్వాతి పరిణామాలపై ఇంటిలిజెన్స్ ఇచ్చిన నివేదికలు ఏమయ్యాయన్నారు. గత ఆదివారం నుంచి అల్లర్లు చెలరేగుతుంటే పోలీసు భద్రతను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. వెంటనే అదనపు బలగాలను ఎందుకు రంగంలోకి దించలేదన్నారు. అదనపు బలగాలను వెంటనే మోహరించి.. అక్కడ శాంతిభద్రతలను కాపాడాలని తీర్మానించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3900Kxj
No comments:
Post a Comment