
కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి నిత్యం చిత్రహింసలు పెడుతున్న ఘటన తెలంగాణలోని జిల్లాలో వెలుగుచూసింది. వనపర్తి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు ఉపాధి కోసం కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవల భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త వేధించడం మొదలుపెట్టాడు. రెండ్రోజుల క్రితం జరిగిన గొడవ కారణంగా ఆగ్రహానికి గురైన భర్త ఇనుప రాడ్‌తో తల పగులగొట్టాడు. Also Read: ఆవేశం చల్లారక ఆమెను వివస్త్రను చేసి శరీరంపై ఇనుప చువ్వలతో వాతలు పెడుతూ ఆ దృశ్యాలను 14ఏళ్ల కొడుకుతో సెల్‌ఫోన్లో వీడియో తీయించాడు. ఆ దుర్మార్గుడి చిత్రహింసలు తట్టుకోలేక ఇంటి నుంచి తప్పించుకున్న బాధితురాలు వనపర్తి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇంటిపై గాయాలు చూసి చలించిపోయిన పోలీసులు ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read: నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సెల్‌ఫోన్లో చిత్రీకరించిన వీడియో చూసి షాకయ్యారు. భర్త ఆమెను అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేశాడని, ఈ వీడియో చూస్తే ఎవరైనా చలించక మానరని వనపర్తి ఎస్ఐ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భర్తను అదుపులోకి తీసకుని విచారిస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ రిధిలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేసినట్లు వనపర్తి పోలీసులు తెలిపారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2HWOamz
No comments:
Post a Comment