Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 4 February 2020

మరోసారి ట్రంప్ విపరీత చర్యలు.. ఒళ్లుమండి ప్రసంగ పత్రాలను చించేసిన స్పీకర్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రతినిధుల సభ స్పీకర్‌ మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తన వార్షిక ప్రసంగం సందర్భంగా నాన్సీ పెలోసీకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు ట్రంప్‌ నిరాకరించడంతో ఆమె‘ప్రతీకార చర్య’కు దిగారు. సభలో అందరిముందే ట్రంప్‌ ప్రసంగ పత్రాలను ఆమె చించేశారు. అధ్యక్షుడు మంగళవారం కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి వార్షిక ప్రసంగం చేశారు. అయితే అంతకుముందు తన ప్రసంగం కాపీని స్పీకర్ నాన్సీకి ట్రంప్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె అధ్యక్షుడికి షేక్‌హ్యాండ్‌ అందించగా.. ట్రంప్‌ తన చేతిని ఇవ్వకుండానే వెనక్కి తిరగడంతో నాన్సీ ఒకింత అసహనానికి గురయ్యారు. ఆ తర్వాత ట్రంప్‌ వెంటనే తన ప్రసంగాన్ని పూర్తి చేస్తుండగా సభలోని వారందరూ చప్పట్లు కొడుతూ ఆయన అభినందించారు. ఆ సమయంలో నాన్సీ ఉన్నట్టుండి ట్రంప్‌ ప్రసంగం ప్రతులను చించేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకుంది. అనంతరం ట్రంప్‌ ప్రసంగ పత్రాలను ఎందుకు చించేశారని నాన్సీని మీడియా ప్రశ్నించగా... ఎందుకంటే ఆయన చేసిన పనికి ప్రత్యామ్నాయంగా ఇదే మర్యాదపూర్వకమైన పని’ అని ఆమె సమాధానం చెప్పారు. గతంలోనూ ట్రంప్, నాన్సీ మధ్య ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. గతేడాది కాంగ్రెస్‌ను ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగిస్తుండగా నాన్సీ వెటకారంగా చప్పట్లు కొట్టారు. అలాగే ఇటీవల ట్రంప్‌‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం విషయంలో నాన్సీ త్వరితిగతిన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ ఎదురుపడటం ఇదే తొలిసారి. ఈ ఘటనపై ట్రంప్ సలహాదారు జిమ్ అకోస్టా స్పందిస్తూ.. నాన్సీ పెలోసీకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తప్పుచేశారని అన్నారు. ఈ చర్యలతో రెండు చీలిపోయిన అమెరికాను స్వస్థత చేకూర్చడానికి వచ్చిన అవకాశాన్ని ట్రంప్ కోల్పోయాడని వ్యాఖ్యానించారు. దీనిపై ట్విట్టర్‌లో నాన్సీ స్పందిస్తూ.. ‘డెమోక్రాట్లు ఎప్పుడూ స్నేహానికి చేయి అందించడం ఆపరు.. సాధ్యమైనంత వరకూ సాధారణ పరిష్కారానికి కనుగొనడానికి తాము కృషి చేస్తాం.. కానీ తమ ఎప్పుడూ భూమిపైనే నిలబడతాం’అని ట్వీట్ చేశారు. గతేడాది అక్టోబరులో సిరియాపై శ్వేతసౌధంలో సమావేశం తర్వాత ట్రంప్‌తో ఇప్పటి వరకూ మాట్లాడలేదని నాన్సీ స్పష్టం చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31oUZqb

No comments:

Post a Comment