భార్య కోపంతో మూడేళ్ల కొడుక్కి మద్యం తాగించిన రౌడీషీటర్

భార్యపై కోపంతో ఓ రౌడీషీటర్ దారుణానికి పాల్పడ్డాడు. కుమారుడి చేత మద్యం తాగించి, ఆ దృశ్యాల్ని వీడియో తీసి పంపాడో భార్యకు పంపించి పైశాచికానందం పొందాడు. మాగడిరోడ్డు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ వికృత చేష్ట ఆలస్యంగా వెలుగుచూసింది. Also Read: బెంగళూరు మాగడిరోడ్డు ప్రాంతానికి చెందిన కుమారేశ్‌ కొంతకాలం క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ బాబు పుట్టాడు. ఆ తర్వాత కుమారేశ్ రౌడీషీటర్ అని తెలుసుకున్న యువతి అడిని నిలదీయగా తన్ని తరిమేశాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల భార్య దగ్గర నుంచి కొడుకును ఎత్తుకొచ్చిన కుమారేశ్ ఆమెను వేధించసాగాడు. బిడ్డను తనకు అప్పగించాలని కోరినా వినిపించుకోవడం లేదు. Also Read: ఈ క్రమంలోనే ఇటీవల ఇంట్లో ఫ్రెండ్స్‌తో కలిసి అతడు మద్యం తాగిన కుమారేశ్ మూడేళ్ల కొడుకు చేత కూడా తాగించాడు. అంతటితో ఆగకుండా ఆ సన్నివేశాన్ని మొబైల్‌లో వీడియో తీసి సోషల్‌మీడియాలో అప్‌లోన్ చేశాడు. అదే వీడియోను భార్యకు కూడా పంపించాడు. దీంతో ఆమె భర్త దురాగతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని రక్షించి తల్లి ఒడికి చేర్చారు. పరారీలో ఉన్న కుమారేశ్‌ కోసం గాలిస్తున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31pWBjm

Post a Comment

0 Comments