Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 4 February 2020

చైనాలో కరోనా మరణమృదంగం.. 500కి చేరిన మృతులు

చైనాలో మరణమృదంగం కొనసాగుతోంది. ఈ వైరస్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 490కి చేరుకుంది. ఒక్క మంగళవారమే కరోనా వైరస్ కారణంగా 65 మంది మృతిచెందినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. మంగళవారం మరో 3,887 మందికి కొత్తగా వైరస్ సోకినట్టు తెలిపింది. దీంతో మొత్తం 24,324 మంది ఈ వైరస్ బారినపడినట్టు వెల్లడించింది. చైనా వెలుపల మరో రెండు కరోనా వైరస్ మరణాలు చోటుచేసుకోవడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటు హాంకాంగ్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో పది మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణయ్యింది. దీంతో ఆ దేశానికి విమాన సర్వీసులను అమెరికా రద్దుచేసింది. మరోవైపు, జపాన్‌కు చెందిన నౌకలోని 10 మందికి కరోనా వైరస్ సోకినట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రి తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, నౌకలోని మిగతావారికి పరీక్షలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. నౌకలో మొత్తం 3,7000 మంది ఉండగా, ఇప్పటి వరకు 273 మంది పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే మరో 24 దేశాల్లో మొత్తం 176 కేసులు వెలుగుచూసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా వైరస్ ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చైనా, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మరింత ఆలస్యం కానుంది. కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని దేశాల్లోని విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ మెషీన్లు ఏర్పాటుచేశారు. దీనిపై ప్రపంచమంతా అలర్ట్‌ అయి, ముందస్తు జాగ్రత్తలను చేపడుతున్నారు. ఒకప్పుడు సార్స్‌ ప్రబలినపుడు చైనా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిందో ప్రస్తుతం అంతకు మించి ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం చైనాకు మాత్రమే పరిమితం కాదని, అన్ని దేశాల వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. చైనాలో 25,000 విమానాలు రద్దు కాగా, గాంబ్లింగ్‌ కేంద్రమైన మకావు రెండు వారాల పాటు మూసివేస్తున్నారు. చైనాపై ఆధారపడ్డ అంతర్జాతీయ సంస్థలకు గిరాకీ తగ్గడంతో డీలా పడ్డాయి. హ్యుందయ్ ఏకంగా ఉత్పత్తిని నిలిపివేసింది. థాయ్‌లాండ్‌, ఇతర ఆసియాలోని ప్రదేశాలకు ప్రయాణికులు తగ్గారు. 30 శాతం విదేశీ ప్రయాణికులు తమ గ్రూపు ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ubhiDH

No comments:

Post a Comment