Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 23 May 2020

వివాహాలకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి.. ఆదివారం మాత్రమే!

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా వివాహాలను వాయిదా వేసుకుని పరిస్థితి ఎదురయ్యింది. ఆంక్షలతో పెళ్లిళ్లను వాయిదా వేయడంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన వివాహాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వివాహాల కోసం ఎదురుచూస్తున్న వారికి కర్ణాటక ప్రభుత్వం తీపి కబురునందించింది. వివాహాలను ఆదివారం జరుపుకోవచ్చంటూ యడియూరప్ప ప్రభుత్వం చేసిన ప్రకటన పలు కుటుంబాలకు సంతోషానిస్తోంది. లాక్‌డౌన్‌ 4.0 మే 31 వరకు కొనసాగనుండగా.. వివాహాలను ముందుగానే నిర్ణయించుకున్నవారు మే 24, మే 31 తేదీలలో(ఆదివారం) కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించి జరుపుకోవచ్చని కర్ణాటక స్టేట్ డిజాసటర్ మేనేజ్‌మేంట్ అథారిటీకి చెందిన ఉన్నతాధికారి టీకే అనిల్ కుమార్ తెలిపారు. అయితే, పెళ్లికి 50 మందిలోపు అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుందని.. భౌతికదూరం, మాస్కులను ధరించటం, చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవటం వంటి నియయాలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. అయితే కంటైన్‌మెంట్‌ జోన్‌లలో ఉండేవారిని మాత్రం వివాహానికి ఆహ్వానించవద్దని స్పష్టం చేశారు. సౌకర్యవంతమైన ప్రదేశాలలోనే గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేచోటే జరుపుకోవాలని తెలిపింది. అంతేకాకుండా, 65 ఏళ్లు దాటినవారు, 10 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణులు కూడా వివాహ వేడుకల్లో పాల్గొనడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం కూడా నిషేధమని, దీనిని వివాహ వేడుకలో తప్పక పాటించాలని తెలిపింది. పరిమిత సంఖ్యలో ప్రజా రవాణాకు కేంద్రం అనుమతించడంతో బస్సులు రోడ్డెక్కాయి. కొన్ని చోట్ల దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే, ఆదివారం మాత్రం పూర్తిగా బస్సులు నిలిపివేసి, దుకాణాలను మూసివేయాలని నిర్ణయించింది. కేవలం నిత్యావసరాల దుకాణాలు తెరవడానికి అనుమతించి, కర్ఫ్యూ కొనసాగించనున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2XroWEe

No comments:

Post a Comment