
సెల్‌ఫోన్ చార్జర్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించి తొమ్మిదేళ్ల బాలిక కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. నియోజకవర్గం అక్కారం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక కరెంట్ షాక్‌తో మరణించింది. సెల్‌ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో ఈ రోజు ఉదయం బాలిక చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించింది. స్విచ్‌బోర్డుకి పెట్టిన చార్జర్‌ని పట్టుకోవడంతో ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె అక్కడికక్కడే కొందపడి మరణించింది. షాక్‌తో బాలిక మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. Also Read: ..
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2LSYUEB
No comments:
Post a Comment