Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 23 December 2020

సిస్టర్ అభయ హత్య కేసు: ఒకప్పుడు దొంగ.. నేడు న్యాయం పక్షాన నిలబడిన హీరో

28 ఏళ్ల కిందట కేరళలో జరిగిన సిస్టర్ అభయ హత్యకేసులో ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫేలను దోషులుగా నిర్ధారించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అయితే, ఈ కేసును కేరళ పోలీసులు తొలుత ఆత్మహత్యగా భావించారు. కానీ మానవహక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్‌పురక్కల్ ఇది హత్యగా అనుమానించి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను హత్యచేసి బావిలో పడేసినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. కానీ, ఈ కేసు విచారణలో రాజు అనే ఓ దొంగ కీలక పాత్ర పోషించాడు. పొట్టికూటి కోసం దొంగతనాన్ని వృత్తిగా చేసుకున్నా.. సిస్టర్ అభయ కేసులో మాత్రం చివరి వరకు న్యాయం పక్షాన నిలబడ్డాడు. కేవలం మూడు సెంట్ల భూమితోనే జీవనం గడుపుతున్న అతడు.. ఫాదర్‌కు అనుకూలంగా సాక్ష్యం చెబితే కోట్లు ఇస్తామన్నారు. కానీ, ఒక్క రూపాయి కూడా తనకొద్దని సున్నితంగా తిరస్కరించాడు. కోర్టు తీర్పు తర్వాత ఆయన మాట్లాడుతూ.. నా కుమార్తె లాంటి అభయకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానించాడు. నేను ఇప్పటికీ మూడు సెంట్ల భూమితో జీవనం సాగిస్తున్నా... ఈ కేసు విషయంలో చాలా మంది కలిసి కోట్లు ఇస్తామని ఆశపెట్టినా.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అన్నాడు. కొట్టాయం పియూస్ ఎక్స్ కాన్వెంట్‌లో అభయ హత్య జరిగే సమయానికి రాజు అక్కడకు దొంగతానికి వెళ్లినట్టు తెలిపాడు. హాస్టల్‌లో దొంగతానికి వెళ్లగా.. ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫేలు అభయను కొట్టి బావిలో పడేసిన దృశ్యం అతడి కంటబడింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా మారడంతో అతడికి డబ్బులు ఆశపెట్టి తమవైపు తిప్పుకోడానికి థామస్ కొట్టూరు తరఫున పలువురు ప్రయత్నించారు. కానీ, రాజు మాత్రం ప్రలోభాలకు లొంగిపోలేదు. ఈ తీర్పు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు. ‘ఈ తీర్పుతో ఆమెకు (అభయ) న్యాయం జరిగింది.. ఆమె నా పిల్లల్లాంటింది.. ఈ న్యాయానికి ఆమె అర్హురాలు.. నాకూ ఓ కూతురు ఉంది.. నా చుట్టుపక్కల ఇళ్లలోనూ చాలా మంది ఆడపిల్లలు ఉన్నా వారు జీవితంలో ఇటువంటి సమస్యను ఎదుర్కొని ఉండరు.. ఇలాంటివి వారికి జరిగినప్పుడు కుటుంబం పరిస్థితిని ఊహించుకోండి.. ఈ రోజు నా కుమార్తెకు న్యాయం జరిగింది.. నేను దీని గురించి చాలా సంతోషంగా ఉన్నాను’ అని వ్యాఖ్యానించాడు. చాలా మంది డబ్బు ఆశచూపి ప్రలోభపెట్టి నా మనసు మార్చడానికి ప్రయత్నించారు.. కానీ వాటిని తిరస్కరించాను.. అంతేకాదు, సిస్టర్ అభయ తల్లిదండ్రులు జీవించిలేరు ఆమెకు ప్రస్తుతం నేనే సంరక్షకుడిని కళ్లు చెమర్చాడు. ‘నా బిడ్డకు న్యాయం జరిగింది.. వారి కుటుంబంలో ఎవరూ లేనందున ఆమెను నా బిడ్డగా చెప్తున్నాను.. అందుకే నేను ఆమె తండ్రిగా మాట్లాడుతున్నాను.. నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని హర్షం వ్యక్తం చేశాడు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3aANJxT

No comments:

Post a Comment