భద్రాద్రి జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. బాధితుడికి రూ.1.75లక్షల టోకరా

జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మానసిక బాధలను క్షుద్రపూజలు ద్వారా తొలగింపజేస్తామని నమ్మబలికిన ఓ ముఠా వలలో పడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులు మోసపోయిన టేకులపల్లి మండల పరిధిలో గురువారం వెలుగుచూసింది. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన షేక్‌ బకర్‌సిద్ధిక్‌ కొంతకాలంగా మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఇతనికి టేకులపల్లి మండలానికి చెందిన కోరం రవీందర్‌ అలియాస్‌ సురేశ్‌తో పరిచయముంది. Also Read: షేక్‌ బకర్‌సిద్ధిక్‌ మానసిక ఇబ్బందులను ఆర్థికంగా మలుచుకోవాలని భావించిన రవీందర్‌ కన్నింగ్ ప్లాన్ వేశాడు. క్షుద్రపూజలు చేసి ఇబ్బందులు తొలగిస్తాననీ, ఇందుకుగానూ ఖర్చు అవుతుందని తెలపడంతో బకర్‌సిద్ధిక్‌ కూడా ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. మొత్తం రూ.1.75లక్షలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌గా రూ.49,999 ఫోన్‌పే ద్వారా పంపించాడు. బుధవారం రాత్రి తడికలపూడి మార్గంలో బాధితుడిని ఓ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి క్షుద్రపూజలు ప్రారంభిచేందుకు సిద్ధమయ్యారు. పూజ ప్రారంభానికి ముందు మిగిలిన రూ.1.25లక్షలను కూడా ఇవ్వాలని కోరడంతో బకర్‌సిద్ధిక్‌ ఆ మొత్తాన్ని కూడా రవీందర్‌కు నగదు రూపంలో ఇచ్చాడు. Also Read: పూజ ప్రారంభిస్తున్న సమయంలో రవీందర్ ప్లాన్ ప్రకారం కొందరు వ్యక్తులు పొదల మాటు నుంచి వచ్చి వారిపై దాడి చేశారు. దీంతో రవీందర్, బకర్‌సిద్ధిక్‌ చెరో దిక్కుకు పరారయ్యారు. బాధితుడు భయంతో టేకులపల్లి చేరుకుని తనకు జరిగిన ఘటనను స్థానికులకు చెప్పి ఆవేదన చెందాడు. ఫోన్‌పే ద్వారా రూ.49,999, నగదు రూపంలో రూ.1.25లక్షలు ముట్టజెప్పినట్లు వివరించారు. దీంతో స్థానికులు టేకులపల్లి ఎస్సై ఇమ్మడి రాజ్‌కుమార్‌‌కు సమాచారం ఇచ్చారు. దీనిపై ఇంకా ఫిర్యాదు అందలేదని, గోప్యంగా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3a6lZOI

Post a Comment

0 Comments