ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీ తగిలిందని, విదేశాల నుంచి గిఫ్టులు పంపిస్తున్నామంటూ ప్రజలను మభ్యపెట్టి భారీగా దోచుకుంటున్నారు. మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్లలో మనీని కొట్టేస్తున్నారు. రకరకాల ఆఫర్ల పేరుతో వచ్చే ఫోన్‌కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని పోలీసులు ఎంత చెప్పినా కొందరు పట్టించుకోకుండా మోసపోతున్నారు. తాజాగా ఖరీదైన ఐఫోన్‌ను కేవలం రూ.4 వేలకే ఇస్తానంటూ ఓ సైబర్ నేరస్థుడు పాతబస్తీకి చెందిన యువతిని నమ్మించి రూ.లక్ష కొట్టేశాడు. యువతి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ దర్యాప్తు ప్రారంభించారు. Also Read: పాతబస్తీకి చెందిన ఓ యువతి తన ఫోన్ పాడవడంతో సెకండ్ హ్యాండ్ ఫోన్ కోసం ఇటీవల ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చింది. ఈ క్రమంలోనే ఐఫోన్ 5ఎక్స్‌ఈ ఫోన్ రూ.6500కే అన్న ప్రకటనను చూసింది. ప్రకటన కర్త రావు సాహెబ్‌కు ఫోన్ చేయగా.. రూ.6500 పంపితే ఐఫోన్ పంపిస్తానని అతడు చెప్పాడు. అయితే తనకు రూ.4 వేలకే ఇవ్వాలని ఆమె కోరగా అతడు అంగీకరించాడు. దీంతో వెంటనే అతడు చెప్పిన బ్యాంక్ అకౌంట్‌కు రూ.4వేలు పంపించింది. కాసేపటికే ఫోన్ చేసి మరో రూ.2వేలు ఇస్తేనే ఫోన్ ఇస్తానని చెప్పడంతో పంపించింది. Also Read: మరోసారి ఫోన్ చేసి గూగుల్ పేలో సాంకేతిక ఇబ్బందులున్నాయని రూ.15వేలు పంపిస్తే.. తిరిగి వాటిని వెంటనే ట్రాన్స్‌ఫర్ చేస్తానని చెప్పాడు. ఇలా పలు దఫాలుగా ఆమె నుంచి రూ.లక్ష వరకు కొట్టేశాడు. తర్వాత అతడి ఫోన్ నంబర్ స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన యువతి శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2xWLcgd
0 Comments