దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. నిర్ధారణ పరీక్షల్లో ఐసీఎంఆర్ కీలక మార్పులు

దేశంలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకే వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే, తాజాగా పుణేకు చెందిన ఓ మహిళకు వైరస్ సోకినట్టు గుర్తించారు. ఆమె విదేశాలలో పర్యటించకపోయినా వైరస్ బారినపడింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 258 కేసులు నమోదు కాగా, శనివారం 35 కొత్త కేసులను గుర్తించారు. ఈ నేపథ్యంలో కోవిడ్ పరీక్షల విధానంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ () మార్పులు చేసింది. కొత్త విధానం ప్రకారం తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, దగ్గుతో ఆసుపత్రిలో చేరిన రోగులందరికి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ వారం రోజుల నుంచి దేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య ఎక్కువగా నమోదుకావడంతో ఐసీఎంఆర్ అపెక్స్ బాడీ.. కోవిడ్ నిర్ధారణ పరీక్ష విధానంలో మార్పులు చేసింది. ఓ వ్యక్తికి కరోనా వైరస్ నిర్ధారణ అయితే అతడితో ప్రత్యక్షంగా కాంటాక్టులో ఉన్నవారికి ఐదో రోజు, 14 వ రోజు నమూనాలను పరీక్షించాలని కొత్త మార్గదర్శకాలు పేర్కొన్నాయి. వైరస్ వ్యాప్తి సమర్థవంతంగా నిరోధించడం, ప్రమాణాలకు అనుగుణంగా రోగ నిర్ధారణ చేయడమే ఈ మార్గదర్శకాల ప్రధాన లక్ష్యం. ఇప్పటి వరకు గత 14 రోజులలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసినవారిలో కోవిడ్ లక్షణాలున్నవారికి, వారికి చికిత్స చేసే వైద్య సిబ్బందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో నిర్ధారణ అయిన కరోనా కేసులన్నీ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో పర్యటించినవారు, వారితో కాంటాక్ట్‌లో ఉన్నవారిలోనే గుర్తించారు. అయితే, దేశంలో ఇంత వరకూ కరోనా వైరస్ సమూహాల నుంచి వ్యాపించినట్టు గుర్తించలేదు. వైరస్ కమ్యూనిటీ ద్వారా వ్యాప్తిచెందితే మరోసారి వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో మార్పులు ఉంటాయని ఐసిఎంఆర్ తెలిపింది. నిర్ధారణ పరీక్షలు క్రమానుగతంగా మారుతాయని స్పష్టం చేసింది. కరోనా వైరస్ తీవ్రత, నియంత్రణ గురించి ఏర్పాటుచేసిన ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ వీకే పాల్ నేతృత్వంలోని ఏర్పాటైన నేషనల్ టాస్క్‌ఫోర్స్ వ్యాధి నిర్ధారణ పరీక్షలపై సమీక్ష నిర్వహించి ఈ మార్పులు చేపట్టారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3a8vq0b

Post a Comment

0 Comments