ప్రేమోన్మాదానికి మరో యువతి బలైపోయింది. జిల్లా మండల పరిధిలోని ఓ గ్రామంలో మహిళా గ్రామ వాలంటీరు గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామంలో నాయనమ్మ, తండ్రితో కలిసి నివసిస్తున్న యువతి గ్రామ వాలంటీరుగా ఉద్యోగం సాధించింది. అదే గ్రామంలో వాలంటీర్‌గా పనిచేసే మల్లాడి కృష్ణ (27) అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు చేసేవాడు. Also Read: అయితే అతడి ప్రేమను యువతి అంగీకరించకపోవడంతో తరుచూ వెంటపడి వేధించేశాడు. ఈ విషయాన్ని యువతి కుటుంబసభ్యులకు చెప్పడంతో పెద్దల మధ్య పంచాయతీ పెట్టి అతడిని మందలించారు. అయినప్పటికీ కృష్ణ వైఖరిలో మార్పు రాలేదు. తనను ప్రేమించకపోతే అంతు చూస్తానని తరుచూ వేధించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. గురువారం అందరూ నిద్రపోయాక గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంది. ఈ విషయాన్ని గమనించిన ఆమె నాయనమ్మ తలుపు తట్టినా తీయలేదు. దీంతో ఆమె స్థానికులను రప్పించి తలుపు పగులగొట్టి చూడగా యువతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. Also Read: స్థానికులు వెంటనే ఆమెను కిందికి దించి అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. యువతిని పరీక్షించిన స్థానికులు అప్పటికే చనిపోయిందని తేల్చారు. ప్రభుత్వాసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3dkcehW
0 Comments