అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అటార్నీ జనరల్, తన కార్యాలయంలోనే మహిళా ఉద్యోగిపై అత్యాచారం ఘటనపై దర్యాప్తులో అలసత్వం వహించిన మంత్రికి ఆస్ట్రేలియా ప్రధాని షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరికీ తన క్యాబినెట్‌లో హోదాలు తగ్గించి ప్రాధాన్యతలేని శాఖలకు బదలాయించినట్టు సోమవారం వెల్లడించారు. దీంతో అధికార కన్సర్వేటివ్ పార్టీపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రధాని చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. రక్షణ మంత్రి లిండా రెనాల్డ్స్, అటార్నీ జనరల్ క్రిస్టియన్ పోర్టర్‌లకు డిమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అటార్నీ జనరల్ పోర్టర్.. 1988లో ఓ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితురాలు గతేడాది జూన్‌లో మృతిచెందింది. రక్షణ శాఖ మంత్రి లిండా రెనాల్డ్స్ కార్యాలయంలోనే ఓ మహిళా అధికారి అత్యాచారానికి గురయ్యింది. ఈ ఘటనలపై ఆస్ట్రేలియాలో వ్యతిరేకత వ్యక్తం కాగా.. మోరిసన్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ ఇద్దర్నీ కొద్దివారాలు పదవులకు దూరంగా ఉంచిన మోరిసన్.. తిరిగి బాధ్యతలను అప్పగించారు. అధికార లిబరల్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తి 2019 మార్చిలో తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధిత యువతి ఆరోపించిన విషయం తెలిసిందే. రక్షణ మంత్రి లిండా రెనాల్డ్స్ కార్యాలయంలోనే ఈ ఘోరం జరిగిందని ఆమె పేర్కొంది. తాజాగా, ప్రస్తుతం వారి శాఖల్లో మార్పుచేస్తూ ప్రాధాన్యతలేని విభాగాలను అప్పగించారు. రెనాల్డ్స్‌కు ప్రభుత్వ సర్వీసులు, పోర్టర్‌కు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు బదిలీ చేశారు. పోర్టర్, రెనాల్డ్స్‌కు వ్యతిరేకంగా వేలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చిన నిరసన తెలుపుతున్నారు. అత్యాచారం ఆరోపణలపై నిరసనలు కొనసాగుతుండగా... మరికొన్ని లైంగిక వేధింపు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఎంపీ ఆఫీసులో సిబ్బంది ఒకరు హస్త ప్రయోగం చేసుకుంటున్న ఫోటో, ఒక సెక్స్ వర్కర్‌పై ఎంపీ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు, ఆన్‌లైన్‌లో మహిళలను వేధించి మరో ఎంపీ క్షమాపణలు కోరడం వంటివి మోరిసన్ ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించాయి. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో మహిళలకు సముచిత స్థానం ఇచ్చినట్టు మోరిసన్ పేర్కొన్నారు. ఇది ‘ఆస్ట్రేలియా క్యాబినెట్‌లో ఇప్పటి వరకు బలమైన మహిళా ప్రాతినిధ్యం’ అని వ్యాఖ్యానించారు. మోరిసన్ పదవీకాలం మరో ఏడాది మాత్రమే ఉండగా.. కరోనా సంక్షోభం ఎదుర్కొవడంలో కొంత అసంతృప్తి ఎదుర్కొంటున్నారు
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3waN3HM
No comments:
Post a Comment