జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. బారాముల్లా జిల్లా సోపోర్‌లో మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి కౌన్సిలర్, పోలీస్ అధికారిని కాల్చి చంపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరో కౌన్సిలర్ గాయపడ్డారు. సోమవారం (మార్చి 29) మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు కశ్మీర్ ఐజీ తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీస్ అధికారి షఫ్కత్ అహ్మద్, కౌన్సిలర్ రియాజ్ అహ్మద్ మృతి చెందారని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. మరో కౌన్సిలర్ షంషుద్దీన్ పీర్ గాయపడినట్లు తెలిపారు. గాయపడిన కౌన్సిలర్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3ftGWsx
No comments:
Post a Comment