
కర్ణాటకలోని మైసూరు నగర శివారులో ఎంబీఏ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. స్నేహితుడితో కలిసి వెళుతున్న సమయంలో అతడిని కొట్టి యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో బాధితురాలు స్నేహితుడితో కలిసి మైసూరు శివారులోని చాముండి కొండల దిగువన ఉన్న లలితాద్రిపుర ప్రాంతానికి వెళ్లింది. ఈ సమయంలో మద్యం సేవిస్తున్న ఆరుగురు యువకులు వారిని వెంబడించారు. యువతి స్నేహితుడిని తీవ్రంగా గాయపరచి ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అతికష్టమ్మీద స్నేహితుడి సాయంతో బాధితురాలు సమీపంలోని ఆసుపత్రిలో చేరింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న డీసీపీ ప్రదీప్ గుంటి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఆలనహళ్లి పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఇంకా షాక్ నుంచి కోలుకోలేదని, ఆమె వాంగ్మూలం నమోదుచేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. నిందితులను త్వరలోనే పట్టుకుని బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. యువకుడిని దారుణంగా గాయపరిచి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు చెందిన బాధిత విద్యార్ధిని మైసూరులోని ఓ ప్రయివేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. ఇప్పటి వరకూ ఏ ఒక్క నిందితుడూ దొరకలేదని, పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నామని కర్ణాటక హోం మంత్రి అరగా జ్ఞానేంద్ర అన్నారు. తొలుత యువతి, ఆమె స్నేహితుడ్ని అడ్డుకున్న నిందితులు.. డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకపోవడంతో స్నేహితుడ్ని కొట్టి.. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కర్ణాటక పర్యాటక రాజధానిలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తాము సిగ్గుతో తలదించుకుంటున్నామని హోం మంత్రి పేర్కొన్నారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3sQAmB2
No comments:
Post a Comment